HYD ఈవెంట్ కి అయినా హీరోయిన్ వస్తుందా?
Kayadu Lohar - The Paradise
ది ప్యారడైజ్ లో హీరోయిన్ గా నటించిన కాయదు లోహర్ ప్యారడైజ్ ప్రమోషన్స్ లో కనిపిస్తే ఒట్టు. నెల రోజులుగా ఏం ప్రమోషన్స్ చెయ్యడం లేదు. కేవలం నాలుగు రోజుల నుంచే హీరో నాని పాన్ ఇండియాలోని చెన్నై, బెంగుళూరును, కొచ్చి లలో ప్యారడైజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
ఈమాత్రం ప్రమోషన్స్ కే వేరే సినిమా షూటింగ్ నుంచి వచ్చేందుకు హీరోయిన్ కాయదు లోహర్ కు పర్మిషన్ దొరకలేదు అని చెబుతున్నారు. హీరో నాని నే ఇది చెప్పాడు. ఇది నిజంగా విచిత్రమే కదా. నాలుగు రోజులు కూడా ప్రమోషన్స్ చెయ్యలేని స్థితిలో కాయదు ఉందా, అంటే ప్యారడైజ్ టీమ్ తో ఆమెకు విభేదాలు ఉన్నట్టే లెక్క.
ఒకవేళ గొడవలేం లేవు అనుకుంటే రేపు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగబోయే ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయినా కాయదు లోహర్ రావాలి. లేదు అంటే ఖచ్చితంగా కాయదు కి ప్యారడైజ్ టీం కి గొడవలు జరిగినట్టే. ఇక నాని ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో సోలోగా ప్రమోషన్స్ చేసొచ్చాడు. ఇక్కడ తెలుగులో ప్రదీప్ మాచిరాజు ఇంటర్వ్యూలోను ఒక్కడే కనిపించాడు. ఆ ఇంటర్వ్యూలోను కాయదు మిస్సింగ్.
















































