BB10: రోహిత్, షాలిని సెట్ అవ్వాల్సిందే
Bigg Boss 10 Telugu Saturday Episode highlights
బిగ్ బాస్ సీజన్ 10 లో కామనర్స్ గా ఎంటర్ అయిన రోహిత్, అమన్, షాలిని, సృష్టి, ఝాన్సీ, చరణ్ లలో రోహిత్, షాలిని లు నోరేసుకుని పడిపోతూ హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. చిన్నదానికి పెద్దదానికి తగువు పెట్టుకుంటూ షాలిని ఓవర్ చేస్తుంది. తన తప్పు ఉన్నా ఒప్పుకోదు, ఎదుటివాళ్లది ఒప్పు అంటే ఒప్పుకోదు.
ఇక రోహిత్ గ్రూప్ మైంటైన్ చెయ్యడమే కాదు హౌస్ లో అందరూ తను చెప్పిందే వినాలనే మెంటాలిటీ అతనిది. షాలిని, అమన్, సృష్టి, చరణ్, ఝాన్సీ వీళ్లంతా తను చెప్పింది వినాలని, అలాగే టాస్క్ ఆడాలని అతను అనుకుంటాడు. సెలబ్రిటీస్ మీదకి ముఖ్యంగా త్రిగుణ మీదకి రెచ్చిపోయి వెళ్తాడు.
గత వారం వీకెండ్ లోనే హోస్ట్ నాగార్జున రోహిత్ కి క్లాస్ పీకారు. ఈ వారమైతే షాలిని బలుపు దించేశారు. నాగ్ చెప్పినా వినడం లేదు అని ఆడియన్స్ చేత వారు చేసిన తప్పులను ఎత్తి చూపించారు. నీ తప్పు ఉన్నా ఒప్పుకోకుండా వర్షిణిపైకి వెళ్లడమే కాదు, వర్షిణి తోసింది అన్నావ్ అంటూ నాగ్ షాలిని క్లాస్ పీకారు.
ఇక రోహిత్ ఆడిన తీరుని వీడియో వేసి చూపించి అతని ఆటపై ఆడియన్స్ అభిప్రాయం అడిగి మరీ రోహిత్ కి వార్నింగ్ ఇచ్చారు. మరి నాగ్ వాళ్ళను తిడుతుంటే బుల్లితెర ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడం చూసి ఈసారి అయినా రోహిత్, షాలిని సెట్ అవ్వకపోతే ఇక ఇంటికే అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
















































