మెగాస్టార్ రేంజ్ కనిపించేలా..
Mega Star set for Multiplex Sensation
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకత గురించి స్పెషల్ గా చెప్పుకోవక్కర్లేదు. చిన్న హీరో అయినా, ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యే నటులు అయినా, పెద్ద హీరో అయినా చిరు కి ఇచ్చే గౌరవం వాళ్ళ మాట్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో సేవ కార్యక్రమాలు, ఎంతోమందికి నేరుగా సహాయం చేసిన చిరు కనిపించకుండా ఎన్నో గుప్తదానాలు చేశారు. మెగాస్టార్ పేరులోనే కాదు అంత హుందాతనంతోనే ఆయన కనిపిస్తారు.
ఇప్పుడు మెగాస్టార్ ఆయన రేంజ్ కి తగినట్టుగా హైదరాబాద్‌లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ తీసుకొస్తున్నారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ సీలెబ్రిటీస్ తో కలిసి హైదరాబాద్, వైజాగ్ ఇలా ప్రధాన నగరాల్లో అన్ని హంగులతో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మల్టీప్లెక్సులు నిర్మిస్తుంది ఏషియన్ సంస్థ.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ హైదరాబాద్ కి తలమానానికంగా నిలవనున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించనున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణానికి భూమి కూడా కేటాయించినట్లుగా సమాచారం.
మరి మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ ఇలా ఈ హీరోల సరసన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేరబోతున్నారు. అది కూడా మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టుగా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ తో అన్నమాట.
















































