ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Katrina Kaif faces trolling over post-pregnancy body

బాడీ షేమింగ్ పై ఇండైరెక్టుగా రియాక్ట్ అయిన కత్రినా

Katrina Kaif faces trolling over post-pregnancy bodyKatrina Kaif faces trolling over post-pregnancy body

 

ఎప్పుడు నాజూగ్గా కనిపించే బాలీవుడ్ భామ మల్లీశ్వరి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహమాడి నటనను కంటిన్యూ చేసింది. అయితే కత్రినా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాచిపెట్టిన ఈ జంట చివరకు బిడ్డ పుట్టాక ఆ విషయాన్నీ రివీల్ చేసారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్  పిల్లలు పుట్టిన తర్వాత వేగంగా జిమ్ లో వర్కౌట్స్ చేసేసి స్లిమ్ గా మారిపోయి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.

కత్రినా కూడా బిడ్డ పుట్టాక నటనలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ తో కలిసి అంబానీ ఇంట గణపతి పూజకి వెళ్ళింది. అక్కడ కత్రిన కాస్త బరువుగా కనిపించడంతో కత్రినపై బాడి షేమింగ్ కామెంట్స్ వినిపించాయి.

ఆ విషయంలో పలువురు నటీమణులు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైనా కాస్త బరువు పెరుగుతారు. శారీరకంగా కొన్ని మార్పులొస్తాయి. ఈ మాత్రం దానికే అలా మాట్లాడాలా అంటూ కత్రినా కు సపోర్ట్ చేసారు. ఇక ఈ ట్రోల్స్ పై కత్రినా కైఫ్ కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందం అంటే.. ఇలానే ఉండాలి అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు నా దృష్టిలో అందం అంటే.. మనకి మనం ఉన్నతంగా కనిపించడమే. హెల్దీ గా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. మనసును ప్రశాంతంగా ఉంచడమే అసలైన సౌందర్యం. ఇలా పైకి కనిపించేది అందం కాదు.. మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేది ముఖ్యం అంటూ కత్రినా కైఫ్ బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. 
 

Katrina Kaif's Bold Reaction to Body Shaming