ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth's Dharman director Ashwath Marimuthu drops important update

రజిని ధర్మన్ షూట్ పై దర్శకుడు క్రేజీ అప్ డేట్

Rajinikanth's Dharman director Ashwath Marimuthu drops important updateRajinikanth's Dharman director Ashwath Marimuthu drops important update


సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ 2 విడుదలకు సిద్దమవుతుంది. అక్టోబర్ 15 జైలర్ 2 విడుదల కాబోతుంది. మెల్లగా టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంది. ఈలోపే రజినీకాంత్ కమల్ నిర్మాతగా మొదలైన ధర్మన్ షూటింగ్ సెట్ లోకి వెళ్లిపోయారు. అశ్వథ్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు..

తాజాగా ధర్మన్ చిత్ర షూటింగ్ పై దర్శకుడు అశ్వథ్ మారిముత్తు క్రేజీ అప్ డేట్ అందించారు. ధర్మన్ షూటింగ్‌లో మొదటి రోజు, మొదటి షెడ్యూల్‌లో రజినీ సార్ కారు దిగి బయటకు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించాం. సూపర్ స్టార్ స్వాగ్ చూసి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను.

ఆయనకు అభిమానిగా సెట్స్‌లోనే నేను ఈల వేసి ఆ క్షణాన్ని ఆస్వాదించాను. నేను రజినీకి వీరాభిమానిగా పడయప్పా సినిమాను 10 నుంచి 15 సార్లు చూశాను. అలాంటి రజినీ సార్ ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, అందులోను ఈ చిత్రాన్ని మరో స్టార్ కమల్ సార్ నిర్మిస్తున్నారు.

రజినీ సార్, అలాగే హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొనే సన్నివేశాన్ని ఫస్ట్ షాట్ గా చిత్రీకరించాం. రజినీ సార్ కారు దిగి రాశీ ఖన్నాతో మాట్లాడి, ఆ తర్వాత ఆసుపత్రిలోకి వెళ్తారు అంటూ ధర్మన్ చిత్ర ఫస్ట్ డే షాట్ పై దర్శకుడు అశ్వథ్ మారిముత్తు చాలా ఎగ్జైట్ అవుతూ షూటింగ్ అప్ డేట్ ని సూపర్ స్టార్ అభిమానులతో పంచుకున్నాడు.

Rajinikanth's Dharman