అయ్యో వినాయక నీకెన్ని కష్టాలొచ్చాయ్
Anantapur: Water Shortage Leaves Ganesha Idols in Dry Tanks, Riverbeds
సామాన్యులకు కష్టాలు వస్తే అయ్యో పాపం అనుకుంటాం, కానీ స్వయానా దేవుడికే కష్టాలు వస్తే ఏమనుకోవాలి. ప్రస్తుతం ప్రపంచమంతా ఎల్ నినో కష్టాలతో అతలాకుతలం అవుతుంది. వర్షాలు పడక, పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలు లేక రిజర్వాయర్లు నిండక పాలకులు కూడా చేతకాక వేడుక చూస్తున్నారు.
మరి ఎల్ నినో ఎఫెక్ట్ కి వినాయకుడికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా.. వినాయక చవితికి వినాయకుడిని ప్రతిష్టించి మూడు, లేక ఐదు, లేక 11 రోజుల పాటు నిత్యం పూజలు చేసి ఆ గణనాథుడిని ఊరేగింపుతో నీటిలో అంటే చెరువుల్లో, నదుల్లో, ఇలా నీటిలో నిమజ్జనం చెయ్యడం తరతరాలుగా వస్తున్న ఆచారం.
కానీ ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా చేసినప్పటికీ.. గణనాధుడు కి నీటిలో మునిగే ప్రాప్తం లేకపోయింది. ఏపీ, తెలంగాణాలోని పలు చెరువులు.. నిండక నీరు లేక బొగులు బొగులు మంటున్నాయి. ఏపీలో అనంతపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడక చెరువుల్లో నీళ్లు లేకుండా పోయాయి.
దానితో వినాయక నిమజ్జనానికి తరలి వచ్చిన గణనాధులను నీళ్లు లేని చెరువుల మధ్యలో వదిలేసి వెళ్లిన ఘటనలు చూసాక అయ్యో వినాయక నీకు కూడా ఎల్ నినో కష్టాలు తప్పలేదు అంటూ భక్తులు మాట్లాడుకుంటున్నారు.















































