వారణాసి: పని ముగించేసిన మహేష్
Mahesh Babu Nears Completion of Varanasi Shoot
ఎస్ ఎస్ రాజమౌళి మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. వారణాసి షూటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇలా ఏ విషయమైనా రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. అక్టోబర్ కల్లా వారణాసి షూటింగ్ ముగించేస్తాం అని చెప్పినట్టుగానే వారణాసి షూటింగ్ ని ఓ కొలిక్కి తెచ్చేసారు.
సూపర్ స్టార్ మహేష్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే కాదు.. డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మహేష్ వారణాసి నుంచి పూర్తిగా రివీల్ అయినట్లే, మళ్లీ ప్రమోషన్స్ కోసం వారణాసి టీమ్ తో జాయిన్ అయితే సరిపోతుంది అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్యాచ్ వర్క్ తో పాటుగా, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నారు.
మహేష్ రాజమౌళి వారణాసి విడుదలయ్యే వరకు వెయిట్ చేస్తారా, లేదంటే వారణాసి విడుదలకు ముందే ఆయన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేస్తారో అనే విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
















































