రిలీజుల్లో మెగాస్టార్ మ‌ళ్లీ 90 డేస్ ని త‌ల‌పించ‌బోతున్నారా?

Vishwambhara vs KaakaVishwambhara vs Kaaka

 

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులు.. సాధించిన ఘనతలు వర్ణనాతీతం. 80, 90ల దశకాల్లో చిరు సినిమాల విడుదల వేగం అభిమానులను  ఉర్రూతలూగించేది. ఒకే నెలలో లేదా ఒకే రోజున‌  రెండు సిని మాలు థియేటర్లలోకి రావడం పాత రోజుల్లో జ‌రిగేది. ఆ తర్వాతి కాలంలో భారీ బడ్జెట్‌లు, సుదీర్ఘ నిర్మాణ సమయం కారణంగా అలాంటి రిలీజ్ లు మళ్లీ చూడలేదు. కానీ ఆ నాటి స్వర్ణయుగం మెగా అభిమానుల మదిలో ఎప్పటికీ ప‌దిల‌మే.

అయితే సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 90ల నాటి వేగాన్ని మెగాస్టార్ పునరావృతం చేయబోతున్నారా? అనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో  ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనవరి రేసులో చిరంజీవి న‌టిస్తోన్న‌ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. `కాకా`, `విశ్వంభర` చిత్రాలు ఒకే నెలలో  థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఇది నాటి రోజులను గుర్తుచేస్తుందని మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి..

ఇప్పటికే `కాకా` రిలీజ్ తేదీ ఫిక్స్ అయింది. జ‌న‌వ‌రి 12 న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇదే సంక్రాంతి రేసులో  భారీ సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న `విశ్వంభర` కూడా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న‌నే మేక‌ర్స్ ప‌డ్డారు. వాస్త‌వానికి రెండు సినిమాల‌కు రెండు నెల‌లైనా గ్యాప్ తీసుకోవాల‌నుకున్నారు. కానీ పాత రోజుల్ని త‌ల‌పించే కోణంలో రిలీజ్ ఆలోచ‌న మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే మెగా అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకానే.

Chiranjeevi