అల్లు అర్జున్ ఎందుకింత కూల్ గా ఉన్నారు
Raaka: Allu Arjun and Atlee's mysterious 37 poster
పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 మూవీస్ తో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన పునాది వేసుకున్న అల్లు అర్జున్, ఆ మార్కెట్ కి అనుగుణంగానే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో రాకా లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్.. ఆ చిత్ర షూటింగ్ లో ఎలాంటి బ్రేక్ లేకుండా పాల్గొంటున్నారు. అనౌన్సమెంట్ విడియోతోనే విపరీతమైన అంచనాలు పెంచేసి ఫస్ట్ లుక్ తో మరింతగా హైప్ క్రియేట్ చేసిన రాకా చిత్ర విడుదలపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
అట్లీ రాకా షూటింగ్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ సినిమా రిలీజ్ తేదీ విషయంలోనూ స్పష్టత లేదు. మరోపక్క 2027 లో రాకా.. రాక అసాధ్యమనే ప్రచారం అల్లు ఫ్యాన్స్ లో ఆందోళన పెడుతుంది. మరి రాకా నుంచి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా, అట్లీ విడుదల తేదీ చెప్పకుండా కామ్ గా ఉన్నారు.
తాజాగా రాకా సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి 37 అంటూ పడిన ట్వీట్ చూసి అందరూ గందరగోళానికి గురవుతున్నారు. రాకా ఏంటి ఈ సస్పెన్స్ అంటూ అడుగుతున్నారు.
అల్లు అర్జున్ కూడా రాకా విడుదల విషయంలో కూల్ గా ఉండడం కూడా చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. సుకుమార్ తో పుష్ప ప్రాజెక్ట్ లు చెయ్యడానికి ఐదేళ్లు పట్టేసింది అనే కదా.. ఆయనతో పార్ట్ 3 చేసేందుకు అల్లు అర్జున్ అంతగా ఆలోచిస్తున్నది. మరి రాకా విషయంలో అల్లు అర్జున్ ఎందుకంత కూల్ గా ఉన్నారో ఆయనకే తెలియాలి.
















































