ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prithviraj Sukumaran on Rajamouli working style

రాజమౌళితో మహేష్ కి ఈజీ-పృథ్వీరాజ్ కి కష్టం

Prithviraj Sukumaran on Rajamouli working stylePrithviraj Sukumaran on Rajamouli working style

 

ఎస్ ఎస్ రాజమౌళి అంటే హీరోలను పిండి మరీ పని చేయించుకుంటారు, హీరోలు రాజమౌళి తో వర్క్ చేసినంతసేపు మాములుగా ఉండదు అంటూ ఎన్టీఆర్ ,రామ్ చరణ్, ప్రభాస్ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం రాజమౌళి తో వర్క్ చెయ్యడం చాలా ఈజీ అని చెప్పి షాకిచ్చారు.

రాజమౌళితో పనిచేయడం చాలా కష్టమని ఆయన నటులను పిండేస్తారంటూ తన తోటి హీరోలు తనని భయపెట్టారని.. కానీ రాజమౌళి మొదట్లో కథ చెప్పినప్పుడు కాస్త కంగారు పడ్డా, ఒన్స్ సెట్స్‌పైకి వెళ్లాక రాజమౌళి ప్లానింగ్, రిహార్సల్స్ చూసి ఆ భయమంతా పోయిందని.. డైరెక్టర్‌ను పూర్తిగా నమ్మడం వల్ల తనకు ఆయనతోవర్క్ చెయ్యడం ఈజీ అనిపించిందని మహేష్ చెప్పుకొచ్చారు.

మరి మహేష్ రాజమౌళితో వర్క్ చెయ్యడం ఈజీ అంటుంటే.. మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం రాజమౌళితో పని చెయ్యడం చాలా కష్టం అంటున్నారు, వారణాసిలో కుంభ పాత్ర శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. నా పాత్రకు శారీరక వైకల్యం ఉంటుంది. చేతులు, కాళ్లు ఒకే పొజిషన్లో లాక్ అయినట్లు నటించాల్సి వచ్చింది.

ఇక సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి రావడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ దర్శకుడు రాజమౌళి స్టయిల్ మాత్రం అదిరిపోతోంది. ఎంత భారీ స్థాయిలో సెట్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. షూటింగ్ సమయంలో ఆయన దృష్టి మొత్తం నటుల పర్ఫార్మెన్స్, క్లోజప్ షాట్లపై ఉంటుంది.

రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఆయన పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చే వరకు సీన్స్ తీస్తుంటారు. ఓ యాక్టర్ నుంచి అత్యుత్తమ నటనను రాబడతారాయన అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వర్కింగ్ స్టయిల్ గురించి గొప్పగా చెప్పారు.
 

Mahesh Babu Says Working With Ss Rajamouli Is Very Easy