ప్యారడైజ్: నిద్రలేని రాత్రులు విజయం వైపు
Srikanth Odela has reportedly not gone home for nearly 40 days
పదే పదే రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఎట్టకేలకు ఈ నెల 24 న విడుదలకు సిద్దమైన నాని ప్యారడైజ్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు టీమ్ మొత్తం రేయింబవళ్లు కష్టపడుతుంది. హరిబరిగా ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ దర్శకుడు శ్రీకాంత్ హీరో నాని పరుగులు పెడుతున్నారు. ఈ టైట్ షెడ్యూల్ లో ట్రైలర్ కూడా వదలలేము అని చేతులెత్తేశారు.
శ్రీకాంత్ ఓదెల గత 40 రోజులుగా ఇంటికి కూడా వెళ్లకుండా ప్యారడైజ్ పనుల్లో తలమునకలై ఉన్నారని, హీరో నాని కూడా ఇంటికెళ్ళకుండా ప్యారడైజ్ విషయంలో కాచుకుని కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్ట్ లు చూసి ఈ నిద్రలేని రాత్రులు విజయం వైపు నడిపించాలని నాని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
రిలీజ్ డేట్ ఇచ్చాక దానికి అనుగుణం వర్క్ పూర్తి చెయ్యాలి, లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఇంకా వర్క్ చేసుకుంటూ రిలీజ్ టైమ్ కి పరుగులు పెట్టడం చాలామంది దర్శకులు చేసేపనే. శ్రీకాంత్ ఓదెల బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కష్టపడడం ఓకే. కానీ ఎందుకు ఇలా అనేది సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాని ప్రశ్న.
















































