మోక్షజ్ఞ కోసం భారీ ప్లాన్
Mokshagna-Vassishta
నందమూరి బాలకృష్ణ-మోక్షజ్ఞ కలిసి కనిపిస్తే అభిమానులకు పండగే. కానీ అలాంటి సందర్భాలు చాలా లైట్ గానే అభిమానులు అనుభవించారు. అలాంటిది బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై ఒకేసారి కనిపిస్తే అభిమానులకు సంబరాలు. ఇప్పుడు అదే మోక్షజ్ఞ ను ఇంట్రడ్యూస్ చెయ్యబోయే దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట.
పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సోషియో ఫాంటసీ డ్రామాలో దర్శకుడు వసిష్ట దాదాపు 40 శాతానికి పైగా అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ ని భాగం చేయబోతున్నాడట. ఇక వెండితెర పై నందమూరి తండ్రీకొడుకులిద్దరూ ఒకేసారి కనిపించే ఆ సన్నివేశం థియేటర్లలో నందమూరి అభిమానులకి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.
ఇది సినిమాని మలుపు తిప్పే కీలక ట్విస్ట్ గా ఉండబోతుంది అని చెబుతున్నారు. ఇక మోక్షజ్ఞ ఈ చిత్రం కోసం స్పెషల్ మేకోవర్ లో కనిపించబోతున్నాడట, ఇక హీరోయిన్ గా శ్రీలీల ని సెలెక్ట్ చెయ్యాలా లేదంటే బాలీవుడ్ భామను దించాలా అనే ఆలోచనలో వసిష్ఠ ఉన్నట్లుగా తెలుస్తుంది.
















































