ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya-Jyothika wedding vows of 20 years

కొత్త ట్రెండ్ కి తెరలేపిన సూర్య-జ్యోతిక

Suriya-Jyothika wedding vows of 20 yearsSuriya-Jyothika wedding vows of 20 years


 

సినీ సెలబ్రిటీస్ ఏం చేస్తే అదే ట్రెండ్ ని రాజకీయనాయకుల దగ్గరనుంచి సామాన్య ప్రజల వరకు ఫాలో అయిపోతారు. వరుడు చిత్రం తర్వాత ఐదు రోజుల పెళ్ళికి అందరూ తెరలేపారు. ఆ ట్రెండ్ ఇప్పటికి నడుస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ హీరో సూర్య, ఆయన భార్య నటి జ్యోతిక లు మరో కొత్త ట్రెండ్ కి తెరలేపారు.

ది సీక్వెల్-మా 20 ఏళ్ల లవ్ అండ్ వార్ సెలబ్రేషన్ అంటూ తమ 20 ఏళ్ళ పెళ్లి బంధాన్ని మరోసారి ప్రేమతో పెళ్లి బంధంతో ప్రమాణాలు చేసుకున్న వీడియో ని జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేసారు. సూర్య, జ్యోతిక కోలీవుడ్ లో స్టార్ కపుల్.. చాలా అందమైన, ఆదర్శమైన జంటగా పేరు తెచ్చుకున్న ఈ జంట చెన్నై నుంచి ముంబై కి షిఫ్ట్ అయ్యింది.

తాజాగా సూర్య, జ్యోతిక 20 ఏళ్ళ మ్యారేజ్ యానివర్సరిని ఎంతో అందంగా అద్భుతంగా సెలెబ్రేట్ చేసుకున్న తీరుకు నెటిజెన్స్ మాత్రమే కాదు సూర్య, జ్యోతిక అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. 2006, సెప్టెంబర్ 11న ఏడడుగుల బంధంతో ఒక్కటైన వీరిద్దరూ, రెండు దశాబ్దాల అనుబంధాన్ని పురస్కరించుకుని విదేశాల్లోని ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో మళ్లీ వివాహ ప్రమాణాలు చేసుకున్నారు.

ఈ వేడుకలో సూర్య కొడుకు, కుమార్తె, తమ్ముడు కార్తీ.. సూర్య, జ్యోతికల వెన్నంటి ఉండగా.. కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈవేడుకలో పాల్గొన్నారు. జ్యోతిక ఈ అద్భుతమైన వీడియో ని షేర్ చేస్తూ.. ది సీక్వెల్-మా 20 ఏళ్ల ప్రేమ, యుద్ధాల వేడుక, ఇది పరిపూర్ణమైన దాంపత్యానికి సంబంధించిన సెలబ్రేషన్ కాదు.. ఇరువైపులా ఉన్న లోపాలు, సర్దుబాట్లు, త్యాగాలు, నిస్వార్థ ప్రేమకు నిదర్శనం. ఒకరి కోసం మరొకరు మలచుకున్న మనస్తత్వాలకు దక్కిన గౌరవం అంటూ జ్యోతిక సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

ఇక కొడుకు తీసుకొస్తున్న తన భార్య జ్యోతికను చూసి సూర్య ఎమోషనల్ అవడం వీడియోలో హైలెట్ అయ్యింది. ఇక ఈ వీడియో లో సూర్య, జ్యోతికలు రొమాంటిక్ గా కనిపించిన తీరుకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. మరి సూర్య-జ్యోతికలు తమ 20 ఏళ్ళ వైవాహిక జీవితానికి గురుతగా మరోసారి ప్రమాణం చేసుకున్నట్టుగా.. సామాన్య ప్రజలు కూడా ఈ కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతారేమో జస్ట్ వెయిట్ అండ్ సి.

Suriya-Jyothika celebrated two decades wedding