యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విజువల్ డివైన్ సాంగ్
Ramayana song Jai Jai Ram takes social media by stormనితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `రామాయణ పార్ట్ 1` చిత్రబృందం గణేష్ చతుర్థి సందర్భంగా `జై జై రామ్` అనే తొలి పాటను విడుదల చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన పలు ముఖ్యమైన పాత్రల నటీనటులను పరిచయం చేసింది. అంతకుముందు ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), రవి దూబే (లక్ష్మణుడు), అరుణ్ గోవిల్ (దశరథుడు), లారా దత్తా (కైకేయి) రూపాలను చూపించగా ఈ పాట ద్వారా భరతుడు, శత్రుఘ్నుడు, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి పాత్రల ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
ఈ పాటలో భరతుడి పాత్రలో మరాఠీ నటుడు ఆదినాథ్ కొఠారే కనిపించగా, లక్ష్మణుడి తమ్ముడు శత్రుఘ్నుడిగా నితీష్ శర్మ నటించారు. అలాగే సీతమ్మ చెల్లెలు, శత్రుఘ్నుడి భార్య అయిన శ్రుతకీర్తి పాత్రను 'పాండ్యా స్టోర్' ఫేమ్ సురభి దాస్ పోషించింది. `ది కేరళ స్టోరీ` తో పాపులర్ అయిన సోనియా బలానీ.. ఊర్మిళ (లక్ష్మణుడి భార్య) పాత్రలో కనిపించగా, `మిస్‌టీరియస్` ఫేమ్ రియా కపూర్.. మాండవి (భరతుడి భార్య) పాత్రలో అలరించారు. ఈ కీలక పాత్రల ఎంపికపై నటీనటులు స్పందిస్తూ ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తమకు లభించిన చారిత్రాత్మక అవకాశమని భావోద్వేగం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా ఆయన లుక్‌ను మేకర్స్ ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. ఓ నివేదిక ప్రకారం సినిమాలో హనుమంతుడి ఎంట్రీని క్లైమాక్స్‌లో లేదా పోస్ట్-క్రెడిట్ సీన్‌లో `బాహుబలి` తరహా క్లిఫ్‌గర్‌గా నిలిపి `రామాయణ పార్ట్ 2`పై భారీ అంచనాలు పెంచేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ తారాగణం , అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
















































