మెగా ఫ్యాన్స్ లో ఫుల్ కన్ఫ్యూజన్

Total confusion among Mega fansTotal confusion among Mega fans


మెగా ఫ్యాన్స్ లో ఫుల్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. మెగాస్టార్ చిరు vs మెగాస్టార్ చిరు ఉండబోతుందా? ఆయన సినిమాతోనే ఆయన సినిమానే పోటీకి దిగుతుందా? సంక్రాంతి 2027 కి చిరు vs చిరు ఉంటుందా? ఇదే మెగా ఫ్యాన్స్ లో నడుస్తున్న కన్ఫ్యూజన్ కి కారణం. చిరు బాబీ తో చేస్తున్న కాక చిత్రం 2027 సంక్రాంతి రిలీజ్ అంటూ ఎప్పుడో అనౌన్స్ చేశారు.

కానీ విశ్వంభర ఇప్పుడు సంక్రాంతి రేస్ లోకి వస్తుంది అనే వార్త మెగా ఫ్యాన్స్ ని అయోమయానికి గురి చేస్తుంది. మరోపక్క విశ్వంభర, కాకా కూడా సంక్రాంతి కి రిలీజ్ అంటూ సోషల్ మీడియా కామెంట్లు. దర్శకుడు బాబీ కాకా ని సంక్రాంతి బాక్సాఫీసు బరి నుంచి తప్పించే ప్రసక్తేలేదు అంటున్నారు. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు అంటున్నారు.

దానితో 2027 సంక్రాంతికి మెగాస్టార్ vs మెగాస్టార్ ఫైట్ ఉండబోతుంది, ఇది ఫిక్స్ అంటూ వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఇదేమిట్రా బాబు, కాకా, విశ్వంభర ఒకేసారి వస్తే ఎలా అంటూ వారు అయోమయానికి గురవుతున్నారు.

Kaaka vs VIshwambhara