ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mohan Babu's hidden character sparks intrigue in The Paradise

బాబు గారిని దాచి పెడుతున్నారు

Mohan Babu's hidden character sparks intrigue in The ParadiseMohan Babu's hidden character sparks intrigue in The Paradise


శ్రీనివాస మంగాపురంతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ చిత్రం అస్సలు వార్తల్లో కనిపించలేదు. దానితో మోహన్ బాబు పాత్ర ను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆయన రీ-ఎంట్రీ ఇచ్చాక నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నారు.

ఈ చిత్రం నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ తప్ప మరే ఇతర అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. నాని ప్యారడైజ్ టీజర్ లోను ఎక్కడా మోహన్ బాబు ని రివీల్ చెయ్యలేదు. ప్రమోషన్స్ లోను మోహన్ బాబు కనిపించరని టాక్ నడుస్తుంది. అసలు ఆయన పాత్ర గురించి ఎలాంటి క్లూ ఇవ్వకుండా హైడ్ చేస్తున్నారట.

ఒకేసారి థియేటర్స్ లో మోహన్ బాబు పవర్ ఫుల్ విలనిజాన్ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ప్యారడైజ్ నుంచి ఎలాగూ ట్రైలర్ కూడా రావట్లేదు. సో మోహన్ బాబు పాత్ర తాలూకు ఎలాంటి క్లూ బయటికి రాదు. అందుకే థియేటర్స్ వరకు మోహన్ బాబు పాత్రను దాచేసి, హైప్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది. 
 

Mohan Babu-The Paradise