ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Maverick Director teams with Saiyaara maker

RGV రైట‌ర్‌గా సెటిలైన‌ట్టేనా?

Maverick Director teams with Saiyaara makerMaverick Director teams with Saiyaara maker

బాలీవుడ్ ప్రముఖ దర్శకులు మోహిత్ సూరి -  రామ్ గోపాల్ వర్మ కలసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరు సంచలన దర్శకులు తొలిసారిగా చేతులు కలిపి ఓ సరికొత్త గ్యాంగ్‌స్టర్ కథను సిద్ధం చేస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. రామ్‌గోపాల్ వర్మ అందించిన కథతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోలకు ప్రాధాన్యత ఉండటంతో ఇండస్ట్రీలోని ఇద్దరు టాప్ స్టార్‌లను ఈ పాత్రల కోసం తీసుకునే ప్రయత్నాలలో దర్శకుడు మోహిత్ సూరి ఉన్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆర్‌జీవీ మార్క్ రైటింగ్, మోహిత్ సూరి టేకింగ్ తో పాటు వైఆర్ఎఫ్ నిర్మాణ విలువలు తోడవడంతో ఈ భారీ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. అయితే ఆర్జీవీ త‌నే స్వ‌యంగా డైరెక్ట్ చేయ‌కుండా స్క్రిప్టు రాసి వైఆర్ఎఫ్ బ్యాన‌ర్ కి అమ్మ‌డంతో అత‌డు ఇక రైట‌ర్ గా సెట‌లైన‌ట్టేనా? అంటూ అభిమానుల్లో సందేహాలు మొద‌ల‌య్యాయి.

Ram Gopal Varma-Mohit Suri teams for a new project