ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay And Trisha Spotted Together At Ajith Kumar's Silverstone Race

వీడియో: త్రిష‌పై సీఎం విజ‌య్ చిరాకు!

Vijay And Trisha Spotted Together At Ajith Kumar's Silverstone RaceVijay And Trisha Spotted Together At Ajith Kumar's Silverstone Race

బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్ లీ మాన్స్ కప్ రేస్‌ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి విజయ్ హాజరుకావడం ఒక చారిత్రాత్మక ఘట్టమైతే, లండన్ షూటింగ్ విరామంలో అక్కడ ప్రత్యక్షమైన నటి త్రిష ఆ టూర్‌ను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చేశారు. గతంలో విజయ్ ప్రమాణ స్వీకారం, స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో కనిపించిన త్రిష ఇప్పుడు విదేశీ గడ్డపై ఆయన పక్కన నిలబడటం వారిద్దరి మధ్య రూమర్స్‌కు మరింత అగ్గి రాజేసింది.

ఈ ఈవెంట్‌కు సంబంధించిన వైరల్ వీడియోలో త్రిష ఫ్రేమ్‌లోకి రాగానే విజయ్ ఒక్కసారిగా తన ముఖాన్ని పక్కకు తిప్పుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది సాధారణ సహజ ప్రతిచర్య అని కొందరు కొట్టిపారేస్తుంటే.. విజయ్ కొద్దిగా అసౌకర్యంగా కనిపించాడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సినిమా ప్రముఖుల ఈ విదేశీ కలయిక .. ఆ వీడియోలోని హావభావాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Vijay And Trisha