ఇరుముడి ఫార్ములాని ఫాలో అయితే బెటర్
Theatres
మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి చిత్రం సాధారణ టికెట్ రేట్లతోనే థియేటర్స్ లో దుమ్ముదులుపి ఆరేసింది. ఇరుముడి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. ఈ చిత్రానికి రూ.250 కోట్ల గ్రాస్ వచ్చింది. అది కూడా టికెట్ రేట్లు పెంచుకోకుండా సాధారణ రేట్లతో. మరి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెరుగుతున్నాయ్.. సామాన్య ప్రేక్షకుడి జేబుకి చిల్లుపడుతుంది.
సాధారణ రేట్ల తో మళ్లీ థియేటర్స్ లో పూర్వ వైభవం వస్తుంది అనుకుంటున్న సమయంలో పెద్ద సినిమాల కోసం నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకునే అవసరం వస్తుంది అంటున్నారు. రేపు రాబోయే నాని ది ప్యారడైజ్ చిత్రానికి టికెట్ రేట్లు పెంచకుండా సాధారణ రేట్లకే సినిమా ని రిలీజ్ చేస్తే ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ రాకమానవు.
కానీ నిర్మాతలు భారీగా బడ్జెట్ పెట్టాము, టికెట్ రేట్లు పెంచుతామంటే ప్యారడైజ్ ని ఆడియన్స్ లైట్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇరుముడి ఫార్ములాని ఫాలో అయితే బెటర్ అనే మాట సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది. చూద్దాం ప్యారడైజ్ మేకర్స్ ప్లాన్ ఏమిటో అనేది!
















































