ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Preity Zinta revealed she tried IVF before welcoming her twins

పిల్లల కోసం ప‌డే వేదన వర్ణనాతీతం!

Preity Zinta revealed she tried IVF before welcoming her twins Preity Zinta revealed she tried IVF before welcoming her twins

 

బాలీవుడ్ నటి ప్రీతి జింటా-జీన్ గూడెనఫ్‌  సంతాన సాఫల్యం కోసం పడిన కష్టాలను ఓ  ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2021లో సరోగసీ పద్ధతి ద్వారా `జై`, `జియా` అనే కవల పిల్లలకు తల్లిదండ్రులైన  జంట ఆ శుభవార్తను అందుకునే ముందు తీవ్రమైన మానసిక ఆందోళనలను ఎదుర్కొన్నారు. సరోగసీకి వెళ్లడానికి కంటే ముందు తాను పలుమార్లు IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చికిత్సను ప్రయత్నించినట్లు ప్రీతి వెల్లడించారు.

IVF ప్రక్రియ సాగుతున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక ఘర్షణ గురించి ప్రీతి జింటా ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా కనిపించే తన వ్యక్తిత్వానికి భిన్నంగా ఆ కష్టకాలంలో నిరంతరం చిరునవ్వులు చిందించడం ఎంతో భారంగా అనిపించేదని  తెలిపారు. కొన్నిసార్లు నిరాశ తారాస్థాయికి చేరినప్పుడు గోడకేసి తల బాదుకుని గట్టిగా ఏడవాలని..ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవాలి అనిపించేదని  త‌న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

మహిళలకు కెరీర్ ఎంత ముఖ్యమో? బయోలాజికల్ క్లాక్ (వయస్సు మరియు సంతానోత్పత్తి) వాస్తవాన్ని గ్రహించి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ప్రీతి అభిప్రాయపడ్డారు. పిల్లలు రెండేళ్లు దాటడంతో మళ్లీ నటనలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన ప్రీతి సన్నీ డియోల్‌తో కలిసి `లాహోర్ 1947` చిత్రం ద్వారా సినీ పునరాగమనం ఇస్తున్నారు.

Preity Zinta revealed she tried IVF before welcoming her twins via surrogacy