ఫౌజి, స్పిరిట్, కల్కి 2 ఒకదానికొకటి?
Fauzi, Spirit, Kalki 2
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించబోయే చిత్రాలు ఒకటి కాదు మూడు సెట్ పై ఉన్నాయి. అందులో రెండు క్రేజీ పాన్ ఇండియా ఫిలిమ్స్ రిలీజ్ డేట్స్ కూడా లాక్ చేసుకున్నాయి. కానీ అనుకున్న తేదీలకు ఆ చిత్రాలు విడుదలవుతాయా అనే అనుమానాలను అందరిలో రాజేశారు. ఫౌజి డిసెంబర్ 3 విడుదల అన్నారు, ఇప్పుడది రావట్లేదు.
అఫీషియల్ గా ఫౌజి పోస్ట్ పోన్ న్యూస్ రాకపోయినా.. ఆ డేట్ ని కొన్ని సినిమాలు లాక్ చెయ్యడం చూసాక ఫౌజి విడుదల కావట్లేదు అనేది అర్ధమవుతుంది. ఫౌజి మేకర్స్ నుంచి క్లారిటీ తీసున్నాకే చైతు వృషకర్మ, దుల్కర్ శ్రీ శ్రీ లు ఆ డేట్ పై కన్నేశాయనేది అర్ధమవుతుంది. వాళ్లకు చెప్పడమెందుకు ఫౌజి మేకర్స్ విడుదల వాయిదాను అధికారికంగా ప్రకటించవచ్చు కదా.
ఫౌజి వాయిదా అనేది అధికారికమే, ఫౌజి డేట్ మారితే సందీప్ వంగ తో చేస్తున్న స్పిరిట్ ఆటోమాటిక్ గా వాయిదా పడుతుంది. ఎందుకంటే ఫౌజి, స్పిరిట్ చిత్రాలు పారలల్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఫౌజి వెనుకే స్పిరిట్ వాయిదా షురూ ఈ రెండు చిత్రాలు వాయిదా పడ్డాక కల్కి 2 షూటింగ్ కూడా వాయిదా పడాల్సిందే.
ప్రభాస్ ఫౌజి, స్పిరిట్ చిత్రాలు ఫినిష్ చెయ్యాలి, దానితో కల్కి 2 షూటింగ్ కోసం ప్రభాస్ రెడీ అవడానికి సమయం పడుతుంది. సో ఫౌజి, స్పిరిట్, కల్కి 2 ఒకదానికొకటి అన్ని గజిబిజి అయ్యాయి.







































