వివాదం: సెలబ్రిటీస్ కి SIR నోటీసులు
Controversy: SIR notices issued to celebrities
SIR అంటూ కేంద్రం కొత్త నిబంధనలు పెట్టి ఓటర్లు తమ ఓటుని పదిలపరుచుకోవడానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తీసివేయడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు చేపట్టడం వంటివి చేస్తారు. SIR ని చేపట్టినప్పుడు ఓటర్ల జాబితాలోని వారంతా తమ ఎన్యుమరేషన్ ఫామ్లను సమర్పించాల్సి ఉంటుంది.
అయితే తెలంగాణాలో SIRప్రక్రియ ఎప్పుడో ముగిసింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కొంతమంది సినీ, రాజకీయప్రముఖులకు SIR మరోసారి నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం పేర్ల తేడాలు, తండ్రి పేరు తప్పులు, మ్యాపింగ్ కాకపోవడమే కారణం, పత్రాలు ఇచ్చినా.. డిజిటలైజేషన్ చేయని BLOలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక SIR నుచి నోటీసులు అందుకున్న ప్రముఖుల్లో.. VVS లక్ష్మణ్, రాజమౌళి, మహేష్ బాబు, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పుల్లెల గోపీచంద్, వెంకటేష్, ఆయన ఇద్దరు కుమార్తెల పేర్లు, సమంత, విజయ్ దేవరకొండ, మురళీ కృష్ణంరాజు, ఉపాసన కొణిదెల లకు SIR నోటీసులు పంపడం చర్చనీయాంశం అయ్యింది.
వీరికే కాకుండా పలువురు సామాన్యులకు కూడా SIR నోటీసులు ఇచ్చింది. అయితే ఓటర్లు మాత్రం BLOలు, AEROల నిర్లక్ష్యంతోనే మ్యాపింగ్ సమస్యలంటున్నారు, మరోపక్క అధికారులు కూడా అధికారులు, ఆపరేటర్ల తప్పిదాలతోనే సమస్యలంటూ అంగీకరిస్తున్నారు.







































