ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> From ring to reality TV. Mary Kom enters Bigg Boss 20

ఆమెతో జాగ్ర‌త్త‌.. నాకౌట్ పంచ్ కి ప‌డుకోవాల్సిందే!

From ring to reality TV. Mary Kom enters Bigg Boss 20From ring to reality TV. Mary Kom enters Bigg Boss 20

భారతీయ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో `బిగ్ బాస్ సీజన్ 20` గ్రాండ్‌గా ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న  కొత్త సీజన్ సెప్టెంబర్ 6న ఘనంగా మొదలైంది. గ్రాండ్ ప్రీమియర్ వేదికపై సల్మాన్ ఖాన్ సూపర్‌హిట్ పాటల మెడ్లీతో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చి షోను వైభవంగా ప్రారంభించారు. ఈ సీజన్ కోసం విభిన్న రంగాలకు చెందిన 16 మంది సెలబ్రిటీ పోటీదారులను సల్మాన్ ప్రేక్షక లోకానికి పరిచయం చేశారు.

ఈ సీజన్ గ్రాండ్ ప్రీమియర్‌లో అత్యంత ఆకర్షణగా నిలిచారు భారత దిగ్గజ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్. మేరీ కోమ్ ఎంట్రీ సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పంపిన ప్రత్యేక వీడియో సందేశాన్ని సల్మాన్ ప్రదర్శించారు. మేరీ కోమ్ బయోపిక్‌లో నటించిన ప్రియాంక, మిగతా కంటెస్టెంట్లకు సరదా హెచ్చ‌రించారు. `మేరీతో జాగ్రత్తగా ఉండండి. ఆమె నాకౌట్ పంచ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి` అని చమత్కరించారు. వేదికపై మేరీ కోమ్ తన పిల్లలను సల్మాన్‌కు పరిచయం చేయగా.. వారి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను అలరించింది.

హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజే మేరీ కోమ్ తన మార్క్ చూపించారు. బెడ్  ఎంపిక విషయంలో ప్రముఖ సింగర్ ఖాజీ తౌకీర్‌తో ఆమెకు చిన్నపాటి అభిప్రాయ భేదం వచ్చింది. ఇక మొదటి కంటెస్టెంట్‌గా నటి కనికా మాన్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. చివరి కంటెస్టెంట్‌గా మహి విజ్య ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు ర్యాపర్ వైల్డ్ డిఎస్‌ఎ, సోషల్ మీడియా సన్సేషన్ అరీష్ఫా ఖాన్, ఈ-స్పోర్ట్స్ గేమర్ స్కౌట్  వంటి వారు హౌస్‌లో సందడి చేశారు.

సీజన్‌లో ఇతర ప్రముఖ కంటెస్టెంట్లుగా టీవీ నటుడు అమన్ గాంధీ, స్ప్లిట్స్‌విల్లా విజేత గుల్లూ , బాద్‌షా మాజీ భార్య ఇషా రిఖీ, మనోజ్ తివారీ కుమార్తె రీతి తివారీ, ఉదితి సింగ్ , అసిఫ్ ఖాన్ హౌస్‌లోకి ప్రవేశించారు.

Mary Kom enters Bigg Boss 20