టికెట్ రేట్ల పెంపు విషయంలో పక్కా క్లారిటీ
Mythri Ravi about Ticket Price Hikes
ప్రస్తుతం యధాతధంగా ఉన్న టికెట్ రేట్లతోనే ఈజీగా రూ.100 కోట్లు, రెండొందల కోట్లు కొల్లగొడుతున్నారు. గత నెల అంటే ఆగష్టు లో విడుదలైన సినిమాలు సాధారణ టికెట్ రేట్లతో చాలానే హిట్ అయ్యాయి, నిర్మాతలకు భారీ లాభాలొచ్చాయి. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, రవితేజ ఇరుముడి రెండు సినిమాలు యదాతదంగా ఉన్న టికెట్ రేట్లతోనే రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్లాయి.
అదే టికెట్ రేట్లు పెంచుకుని భారీ హైప్ తో విడుదలైన యశ్ టాక్సిక్ రెండోరోజుకు సైలెంట్ అయ్యింది. ఇకపై టాలీవుడ్ లో టికెట్ రేట్లు పెంచకుండా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ ని ఆదరిస్తారు, ప్రస్తుతం ఆడియన్స్ మెల్లగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కి అలవాటు పడుతున్నారు.. టికెట్ రేట్లు పెంపు ఉండకపోతే బెటర్ అనుకున్నారు.
అదే విషయాన్ని ఇరుముడి నిర్మాతలను అడిగితే.. వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది అంటే.. రేపు రాబోయే చిత్రాలు రాజమౌళి గ్లోబల్ వైడ్ గా వారణాసి తీస్తున్నారు. అలాగే రాకా, మా నుంచి వస్తున్న…#Fauzi, #Dragon, #RC17, #AA23 , #JaiHanuman ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, సో బడ్జెట్ ఎక్కువవుతుంది. దానితో టికెట్ రేట్లు పెరుగుతాయి.
ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత టికెట్ రేట్లు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నాయి అనేది ఇరుముడి సక్సెస్ మీట్ లో ఇచ్చిన క్లారిటీ. దీనిని బట్టి రాబోయే రోజుల్లో ప్రేక్షకులు జేబులకు చిల్లులు తప్పవన్నమాట.







































