ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Powerful treat from OG Universe unleashed

OG యూనివర్స్: పవర్ స్టార్ పవర్ ఫుల్ వీడియో

Powerful treat from OG Universe unleashed Powerful treat from OG Universe unleashed


పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రీట్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూసారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ ని ఎంజాయ్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ సుజిత్ దర్శకత్వంలో మొదలు కాబోయే OG 2 నుంచి పవర్ ఫుల్ అప్ డేట్ ని ఆశించారు. అయితే OG యూనివర్స్ ఇంకా ట్రాక్ పైకి రాకపోవడంతో సుజిత్ చిన్న సర్ ప్రైజ్ అంటూ పవన్ బర్త్ డే కి ఓ వీడియో రివీల్ చేసారు.

పవన్ కళ్యాణ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సుజిత్ లు OG యూనివర్స్ గురించి డిస్కర్స్ చేస్తున్న పవర్ ఫుల్ వీడియో అది. ఈ కథ కేవలం ప్రస్తుత కాలానికి పరిమితం కాదని వెల్ల‌డించారు. OG ప్రీక్వెల్స్, సీక్వెల్స్ ఉంటాయని.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కాలం నుంచి నేటి వరకు జరిగిన పలు కీలక సంఘటనల నేపథ్యాన్ని తీసుకుని OG యూనివర్స్ ను రూపొందిస్తున్నట్లు దర్శకుడు సుజిత్ వెల్లడించారు.

ఆ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. పవన్ త్వరగా కోలుకుని OG యూనివర్స్ సెట్ పైకి వెళ్ళాలి అని వారు బలంగా కోరుకుంటున్నారు.

OG Universe : Pawan unleashes Explosion