ముందు సీఎంపై చర్యలు తీసుకోండి- కొండా సురేఖ
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ ఎంత హాట్ టాపిక్ గా నడుస్తుందో అందరికి తెలుసు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ ఎంత హాట్ టాపిక్ గా నడుస్తుందో అందరికి తెలుసు. కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న కామెంట్స్ వలన కొండా సురేఖ మంత్రి పదవి కూడా రిస్క్ లో పడింది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల ఫలితంగా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈమద్యలోనే కొండా సురేఖ ఎన్నడూ లేని విధంగా రాఖీ పౌర్ణమి రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి మరీ బంగారు రాఖి కట్టి వచ్చింది. అంతేకాకుండా కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ని కలిశారు. ఈరోజు కొండా సురేఖ ఢిల్లీ వెళ్ళి అధిష్టానాన్ని కలిసింది.
అక్కడ ఆమె వేణు గోపాల్, రాహుల్ గాంధీని కలిసాక నా కూతురు చేసిన కామెంట్స్ వలన నాపై చర్యలు తీసుకోవద్దు అని చెప్పినట్లుగా చెప్పడమేకాదు.. నాపై చర్యలు తీసుకోవాలి అంటే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే నా కూతురుని ఆయన రెచ్చగొట్టారు. అందుకే నా కూతురు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది.
ముఖ్యమంత్రిగా పదేళ్లు తానే ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డిపైన చర్యలు ఉండవా, పరకాల టికెట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రకటన చేస్తారు, తన పైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని సురేఖ డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.







































