ఆదర్శ కుటుంబం వెనక్కి తగ్గుతుందా?
Aadarsha Kutumbam Postponed
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఆదర్శ కుటుంబం. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నట్టుగా ఆదర్శ కుటుంబం నుంచి కేరెక్టర్ వీడియోస్ వదులుతూ హడావిడి చేసారు.
అయితే ఇప్పుడు ఆదర్శకుటుంబం అక్టోబర్ 2 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం షూటింగ్ పూర్తి కాకపోవడమే అని, పోస్ట్ ప్రొడక్షన్ కి, ప్రమోషన్స్ కి సమయం సరిపోదని మేకర్స్ విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
మరోపక్క కూలీ నెం.1 చిత్రంలోని సూపర్ హిట్ పాట దండాలయ్య ఉండ్రాలయ్యను ఆదర్శ కుటుంబం కోసం కొత్తగా రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక త్రివిక్రమ్ ఈచిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ కి తీసుకొస్తారో చూడాలి.







































