బిడ్డ కోసం అప్పుడే వస్తువులు కొంటున్న సమంత
Samantha has gained 11 kg during pregnancy
హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. వ్యాయామాలు, వెకేషన్స్ అంటూ సమంత మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా సమంత తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు, మాతృత్వపు ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది.
బేబీ కోసం తాను అప్పుడే చాలా వస్తువులు కొంటున్నాను అని, కానీ భయమేసి అవన్నీ ప్యాక్ చేసి లాప్ టాప్ స్టాండ్ కింద వాడుతున్నట్టుగా చెప్పిన సమంత తనకు ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కలలు వస్తున్నాయని చెప్పింది. అలాగే తాను ప్రెగ్నెంట్ అయ్యాక 11 కేజీల బరువు పెరిగాను అని చెప్పింది.
బిడ్డ పుట్టాక ఆ బిడ్దను చూసుకోవడం, అలాగే పాలు పట్టడం, స్నానం చేయించడం, జోల పాట పాడడం ఇవన్నిటితో డే అంతా గడిచిపోతుంది. ఫుల్ టైమ్ జాబ్ లా మారిపోతుంది, స్కానింగ్ రిపోర్ట్ వచ్చాక కంగారు, భయం వేశాయంటూ సమంత అభిమానులకు చెప్పుకొచ్చింది. ఇక తన బిడ్డకు పేరు పెట్టే సమయంలో తనకు అభిమానుల సహాయం కావాలని ఈ సందర్భంగా సమంత కోరింది.







































