ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Madhu Chopra reacts to Kriti Sanon’s Rakhi ad row

కృతి స‌న‌న్ కు క్లాస్ పీకిన పీసీ మామ్!

Madhu Chopra reacts to Kriti Sanon’s Rakhi ad rowMadhu Chopra reacts to Kriti Sanon’s Rakhi ad row

బాలీవుడ్ నటి కృతి సనన్  రక్షాబంధన్ ప్రకటన  సోషల్ మీడియాలో ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే.
కృతి స‌న‌న్ ధ‌రించిన దుస్తుల‌పై అంతా దుమ్మెత్తి పోసారు. అయినా తానే క‌రెక్ట్ అంటూ అమ్మ‌డు స‌మ‌ర్దించుకోవ‌డం మ‌రింత మందికి కోపాన్ని తెప్పించింది. తాజాగా ఈ వివాదంపై తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ వివాదంపై మధు చోప్రా మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో యువత నా శరీరం, నా ఇష్టం అనే నినాదాన్ని బలంగా న‌మ్ముతున్నారు. కానీ   సమాజంలో కొన్ని హద్దులు ఎప్పుడూ ఉంటాయనే విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన పిల్లలు కూడా ఆధునిక దుస్తులు ధరిస్తారు.  కానీ ప్రతిదానికీ ఒక నిర్దిష్టమైన పరిమితి, సంస్కృతి ఉంటుంది` అని పేర్కొన్నారు. విభిన్న విషయాలపై ప్రజలు అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నా? సమాజ నైతికతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని మ‌ధుచోప్రా హితవు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొత్తానికి సెలబ్రిటీలు చేసే ప్రకటనలు ..వారి ఎంపికలపై జరిగే ట్రోల్స్ మధ్య మధు చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆధునిక భావాలు, వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సాంప్రదాయ హద్దులు కూడా ముఖ్యమేనని చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Priyanka Chopra's mom on Kriti Sanon ad row