Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sonali Kulkarni - I am learning Telugu, and I am enjoying the process

ప్యార‌డైజ్ బ్యూటీ తెలుగు ప్రయాణం!

Sonali Kulkarni - I am learning Telugu, and I am enjoying the process

 

నటి సోనాలి కులకర్ణి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న `ది ప్యారడైజ్`  చిత్రంతో అమ్మ‌డు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సోనాలి  తెలుగు భాషను నేర్చుకుంటున్నానని.. ఈ ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నానని తెలిపారు.

తెలుగు పరిశ్రమ నుండి  లభిస్తున్న ఆప్యాయత, అభిమానం ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు.  హైదరాబాద్ సంస్కృతికి .. ఇక్కడి వంటకాలకు సోనాలి పూర్తిగా ఫిదా అయిపోయారు. షూటింగ్ సమయంలో కమ్మటి పప్పు  ఎంతో ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్‌గా మారిందని.. అలాగే డబుల్ కా మీఠా అంటే చాలా ఇష్టమని సరదాగా పంచుకున్నారు.

నాని, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులతో కలిసి పనిచేయడం, వారి నటనలోని ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడం అద్భుతమైన సవాల్‌తో కూడిన అనుభూతిని ఇచ్చిందని  తెలిపారు.  మొత్తంగా `ది ప్యారడైజ్` సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనాలి కులకర్ణి తెలుగు భాషపై చూపుతున్న శ్రద్ధ  ఇండస్ట్రీపై వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు  నెటిజ‌నుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Sonali Kulkarni makes her Telugu debut