Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is Kareena Kapoor Khan Pregnant Again?

కరీనా కపూర్‌ గర్భవతి అనే ప్రచారానికి చెక్‌

Is Kareena Kapoor Khan Pregnant Again?

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన కొన్ని వీడియోల ఆధారంగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ మూడవసారి తల్లి కాబోతున్నారంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. కరీనా  కారు వైపు వెళ్తుండగా ఆమె బృందంలోని ఒకరు గొడుగును అడ్డుపెట్టి కెమెరాలకు ఆమె కనిపించకుండా చేయడం .. ఆమె దుస్తుల వల్ల ఏర్పడిన భ్రమతో  గర్భవతి అనే ప్రచారం నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ ఊహాగానాలపై నెటిజన్లు రకరకాలుగా చర్చలు జరిపారు.

ఈ ప్రచారంపై స్పందించిన కరీనా కపూర్ బృందం ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆమె మూడవసారి గర్భవతి కాదని.. ఆ వార్తల్లో నిజం లేదని  సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఇటీవలే క‌రీనా  కుటుం బంతో కలిసి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి పుకార్లు రావడం గమనార్హం. గతంలో కూడా కరీనా  కుటుంబ నియంత్రణ - పిల్లల పెంపకంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

వాస్తవానికి కరీనా  కెరీర్ - వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఇద్దరు పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న ఆమె భవిష్యత్తులో పిల్లల గురించి గతంలోనే తన అభి ప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని స‌న్నిహితులు కోరుతున్నారు. 

Is Kareena Kapoor Khan Pregnant Again? Team Clarifies Pregnancy Rumours