Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Profit Share Demand Leads To Deepika's Exit From Spirit

దీపికా ని స్పిరిట్ నుంచి తప్పించడం కరెక్ట్

Profit Share Demand Leads To Deepika's Exit From Spirit


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ను ముందుగా ప్రభాస్ స్పిరిట్ కోసం ఎంపిక చేసిన దర్శకుడు సందీప్ వంగ ఆతరవాత ఆమెను ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి తప్పించడం సెన్సేషన్ అయ్యింది. ఈ విషయంలో దీపికా వెర్షన్ దీపికాది, సందీప్ వెర్షన్ సందీప్ ది. అటు కొందరు, ఇటు కొందరు సపోర్ట్ చేసారు.

అయితే తాజాగా దీపికా పదుకొనెను స్పిరిట్ నుంచి తప్పించడం కరెక్ట్ అనేలా సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొనె స్పిరిట్ కోసం పెట్టిన కండిషన్స్ నచ్చకే సందీప్ రెడ్డి ఆమెను తపించారనే విషయం అందరికి తెలిసిందే.

దీపికా పదుకొనె స్పిరిట్ పాన్ ఇండియా మూవీ లో నటించినందుకు గాను పారితోషికంతో పాటు లాభాల్లో పది శాతం అదనంగా డిమాండ్ చేయడమే కాకుండా.. పని గంటలు ఆరుకి మించి ఉండకూడదు అనే కండిషన్స్ చూసి చిర్రెత్తుకొచ్చిన సందీప్ రెడ్డి వంగ త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా ఎంపిక చేసి దీపికా కు షాకిచ్చినట్లుగా క్లారిటీ చ్చారు.

స్పిరిట్ షూట్ మొదలుపెట్టకముందు ఈ పాత్ర కోసం ఏడాదిన్నర దీపికా పదుకొనె తో ట్రావెల్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగ ఆమె కండిషన్స్ చూసి ఆమెను తప్పించంలో ఎలాంటి తప్పు లేదు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Deepika Padukone asked for 10% of Spirit movie profits