బిగ్ బాస్ : పాత కక్షలు భగ్గుమన్నాయి
Bigg Boss-Nataraj Master vs Bindu Madhavi
బిగ్ బాస్ లో గతంలో ఉన్న కక్షలు ఇప్పుడు లేటెస్ట్ గా భగ్గుమంటున్నాయి. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో నటరాజ్ మాస్టర్ కి మరో కంటెస్టెంట్ అయిన బిందు మాధవికి హౌస్ లో ఎలాంటి గొడవ జరిగిందో తెలుసు కదా.. బిందు మాధవి తెలుగు అమ్మాయి కాదు చెన్నై అంటూ ప్రాంతీయభేదాలను బయటికి తీసిన నటరాజ్ మాస్టర్ పై నాగ్ కూడా ఫైర్ అయ్యారు. బిందు మాధవి కూడా సివంగి, ఆడపులి అంటూ నటరాజ్ మాస్టర్ ని రెచ్చగొట్టింది.
అయితే ఇది జరిగి రెండేళ్లు కావొస్తుంది. మళ్లీ ఇప్పుడు ఆ పాత కక్షలు భగ్గుమంటున్నాయి. అగ్నిపరీక్ష 2 లో బిందు మాధవి ఓ కంటెస్టెంట్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా నటరాజ్ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ మట్లాడడం హాట్ టాపిక్ కాగా.. నటరాజ్ మాస్టర్ బిందు మాధవి పై కౌంటర్ ఎటాక్ చేసారు.
బిందు మాధవి పై డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. మర్చిపోయావా అంటూ నటరాజ్ మాస్టర్ బిందు మాధవి పై విరుచుకుపడ్డారు. అగ్నిపరీక్షలో వాళ్ళను వీళ్ళను అవమానించిన నువ్వు నన్ను అనే అర్హత లేదు అంటూ బిందు మాధవికి వార్నింగ్ ఇవ్వడం చూసిన వారు బిగ్ బాస్ పాత కక్షలు మళ్లీ భగ్గుమన్నాయిగా అంటూ మాట్లాడుకుంటున్నారు.








































