ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Lokesh Kanagaraj DC enters 100 cr club

సైలెంట్ గా 75 కోట్ల క్లబ్బులోకి లోకేష్ డీసీ

Lokesh Kanagaraj DC enters 100 cr club

 

దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారి చేసిన డీసీ చిత్రం చాలా సైలెంట్ గా థియేటర్స్ లో విడుదలైంది ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కామ్ గా థియేటర్స్ లోకి వచ్చిన డీసీ చిత్రం థియేటర్స్ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పుడైనా సినిమాని ప్రమోట్ చేస్తారనుకుంటే అప్పుడూ మేకర్స్ సైలెంట్ గానే ఉన్నారు.

అయితే లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం సైలెంట్ గా రూ.75 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వినటమే కానీ అఫీషియల్ ప్రకటన లేదు. క్రేజీ హీరోలే రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరడానికి నానా తంటాలు పడుతున్న సమయంలో ఎలాంటి హైప్ లేకుండా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన డీసీ చిత్రం తొమ్మిది రోజులకే రూ.75 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడానికీ రెడీ అవడం సామాన్యమైన విషయం కాదు.

అదే ప్రమోషన్స్ ఉంటె స్టార్ హీరోల రేంజ్ లో లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రానికి కలెక్షన్స్ వచ్చి ఉండేవి అనేది ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అనురుధ్ మ్యూజిక్, డీసెంట్ టాక్ లోకేష్ కనగరాజ్ డీసీ కి ఊహించని విజయాన్ని కట్టబెట్టాయి. 

Lokesh Kanagaraj DC enters 100 cr club