ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bandla Ganesh in tears at his daughter's wedding

కుమార్తె పెళ్ళిలో బండ్ల గణేష్ కన్నీళ్లు

Bandla Ganesh in tears at his daughter's wedding

 

ఈరోజు ఆగష్టు 16 న నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. బండ్ల గణేష్ కుమార్తె జనని పెళ్లికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరు, వెంకటేష్, నాగార్జున, ఇంకా మరికొందరు హీరోలు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతుల చేతుల మీదుగా బండ్ల గణేష్ తన కుమార్తె వివాహాన్ని జరిపించారు. అయితే కుమర్తె పెళ్ళిలో బండ్ల గణేష్ కన్నీటి పర్యంతమయ్యారు. అటు జనని కూడా పెళ్లి పీటలపై కన్నీళ్లు పెట్టుకున్న వీడియోస్, బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏ తండ్రికైనా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేటప్పుడు గుండె కోత ఉంటుంది. 25 ఏళ్ళు అపురూపంగా పెంచుకుని మరో ఇంటి కోడలిగా పంపించడం అంటే ఆ తండ్రికి మరో నరకం ఉండదు. ప్రతి తండ్రి అమ్మాయిల పెళ్లిలో కంటతడి పెట్టుకున్నట్టే బండ్ల కూడా కుమార్తె జనని వివాహం వేడుకలో కన్నీటి పర్యంతమయ్యారు.

గత వారం రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేసిన బండ్ల గణేష్ ఇలా కుమార్తె ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళ నీళ్లతో కనిపించి అందరిని కదిలించివేసారు. 

Bandla Ganesh