పవన్ కళ్యాణ్ కు మరోసారి అస్వస్థత
Pawan Kalyan Has Been Suffering From Fever
రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ముంబై లోని కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకుని వచ్చారు. ఓ వారం రెస్ట్ తర్వాత ఆయన యాదావిదిగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో విధుల్లోకి చేరిపోయారు. ఈరోజు ఆగష్టు 15 జెండా వందనం కార్యక్రంలోను ఆయన పాల్గొన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ప్రతిసారి తీవ్రజ్వరంతో సఫర్ అవుతున్న పవన్ కళ్యాణ్ కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మరోసారి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. దానితో పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభ కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించినట్లుగా తెలుస్తుంది.
అప్పటికే ఫీవర్ తో బాధడుతున్న పవన్ కి జ్వరం తీవ్రం కావడంతో ఆయనను రాజమహేంద్రవరంలో వైద్యుల పరీక్షించారు. కొంత ఉపశమనం అనంతరం, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. లోక్‌భవన్‌లో ఈ సాయంత్రం జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకాలేనని అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఈమధ్యన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో, ఫిజియోథెరపీపై పవన్ కల్యాణ్ వైద్య నిపుణుల సూచనలు తీసుకోనున్నారు.







































