ఈ వారం కింగ్ మేకర్ విశ్వనాథ్
This Week Movie results
నిన్న శుక్రవారం దాదాపుగా ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో సూర్య-వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ అలాగే విశాల్ మకుటం, ఎం.ఎస్ రాజు అగధ, హుషారు పిట్టలు, పళ్ళబరసు చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ ఐదు సినిమాల్లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ మాత్రం ఈ వారం ఆడియన్స్ ని మెప్పించడంలో 100 శాతం సక్సెస్ అయ్యింది.
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ కి ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ చూపించారు, సినీవిమర్శకులైతే 3 కి తగ్గకుండా ఈ చిత్రానికి రేటింగ్ వేశారు. ఆడియన్స్ కి, క్రిటిక్స్ కి ఈమధ్య కాలంలో అంతగా ఆకట్టుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ అనే చెప్పాలి.
విశాల్ మకుటం చిత్రానికి తెలుగులో ఓపెనింగ్స్ లేవు. అలాగే సినిమాకి కూడా ఏమంత పాజిటివ్ టాక్ రాలేదు. నెగెటివ్ టాక్ తో మకుటం మరుగున పడిపోయింది. ఎం.ఎస్ రాజు అగధ కాన్సెప్ట్ బాగున్నా.. ఓల్డ్ స్కూల్ డైరెక్షన్ సినిమాని కిల్ చేసింది. హుషారు పిట్టలు కూడా ఈ వారం వీక్ మూవీగా మిగిలిపోయింది. అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన పళ్ళ బరుసు కూడా డిజప్పాయింట్ చేసింది.
సో ఈ వారం సూర్య-వెంకీల అట్లూరి ల కుటుంబ కథా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ప్రేక్షకులకు నచ్చి థియేటర్స్ లో కింగ్ మేకర్ గా నిలిచింది అనే చెప్పాలి.







































