ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Buchi Babu Sana Plans Film With Chiranjeevi

బుచ్చి కి మరో మెగా ఛాన్సా ?

Buchi Babu Sana Plans Film With Chiranjeevi


మొదటి సినిమా తోనే మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన బుచ్చి బాబు రెండో సినిమాని కూడా మెగా హీరో రామ్ చరణ్ తో పెద్ది చిత్రం తో ఛాన్స్ పట్టేసాడు. పెద్ది చిత్రంలో రామ్ చరణ్ కష్టానికి ఫలితంగా రూ.400 కోట్లు పెద్ది తీసుకొచ్చింది. బుచ్చి బాబు మేకింగ్ స్టయిల్ పై చాలా విమర్శలొచ్చాయి.

పెద్ది తర్వాత బుచ్చి బాబు తో ఎవరు సినిమా చేస్తారు, బూచి బాబు కి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనే విషయంలో చాలా సస్పెన్స్ నడుస్తున్న సమయంలో మెగాస్టార్ చిరు తో బుచ్చి బాబు కి తదుపరి ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చింది అనే మీడియాలో వైరల్ అవడం చూసిన వారంతా అవునా, నిజమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది చిత్రాన్ని ఒడ్డున పడేసేందుకు చిరు రంగంలోకి దిగారు. రామ్ చరణ్ కష్టాన్ని పొగుడుతూ.. బుచ్చి బాబు ని మెచ్చుకున్నారు. కరెక్ట్ గా పెద్ది రిజల్ట్ విషయంలో సోషల్ మీడియా విమర్శలు చిరుని దాటి పోలేదు. అలాంటిది చిరు మరోసారి బుచ్చి బాబు కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరోపక్క చిరు ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ తో కమిట్ అయ్యి ఉన్నారు. ఒకవేళ బుచ్చి బాబు కథ నచ్చినా ఇప్పుడైతే బుచ్చి బాబు తో చిరు సినిమా చేసే ఛాన్స్ అయితే లేదు.

Buchi Babu and Megastar Film