ఫౌజీ పై బాహుబలి అంత నమ్మకం

Prabhas Changed His DP after 7 Years


ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది రాజమౌళి బాహుబలి. బాహుబలి తో పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ బలమైన ముద్ర వేశారు. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆతర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేసారు. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్స్టా లో తన ప్రొఫైల్ పిక్ మార్చలేదు.

బాహుబలి పిక్ ని అప్పుడు అంటే ఏడేళ్ల ముందు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న ప్రభాస్ ఇన్నాళ్లకు అంటే ఫౌజీ చిత్రం చేస్తున్నప్పుడు అదే ఫౌజీ పిక్ ని తన ప్రొఫైల్ గా మార్చుకున్నారు. అది చూసిన చాలామంది బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఫౌజీ పైనే అంత నమ్మకం ఉంది, అందుకే ఏడేళ్ల తర్వాత తన ప్రొఫైల్ పిక్ మార్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ పై విపరీతమైన అంచనాలున్నాయి. ప్రభాస్ కూడా రాజసాబ్ రిజల్ట్ తర్వాత ఫౌజీ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా నిర్మాత రవి శంకర్ తెలిపారు. సో బాహుబలి తర్వాత ప్రభాస్ అంత నమ్మకం పెట్టుకున్నది ఫౌజీ పైనేనేమో... అందుకే ఇలా అంటూ నెటిజెన్స్ కామెంట్లు నిజమయ్యేలా కనిపిస్తుంది.

Prabhas finally changes his iconic Baahubali era Instagram DP with a Fauzi