ఇదే ట్రెండ్ కొనసాగిస్తే థియేటర్స్ కి పూర్వ వైభవమే!

Tollywood Theatres



టికెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు అంటే ఎలా.. భారీ బడ్జెట్ పెట్టాము, మా బడ్జెట్ రికవరీ కోసం టికెట్ రేట్లు పెంచుకుంటాము, ప్రేక్షకులు ఎలా పొతే మనకెందుకు అన్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు గుడ్డిగా జీవో లు జారీ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులకు తెలివొచ్చింది. అందుకే టికెట్ రేట్లు పెంచితే సినిమా థియేటర్స్ వైపు చూడడం మానేసి ఓటీటీ లను నమ్ముకున్నారు.

కానీ కొద్దిరోజులుగా టికెట్ రేట్లు పెంచమని నిర్మాతలు ప్రభుత్వాలను అడగడం లేదు. పాత రేట్లకే సినిమాలు విడుదల చేస్తున్నారు. దానితో మెల్లగా ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు కొరియన్ కనకరాజు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటే కంటెంట్ లోని దమ్మే కాదు..

టికెట్ రేట్లు ఒక కారణమే. టికెట్ రేట్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటేనే వారు సరదాగా థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు అనే దానికి నిదర్శనమే ఈ రూ.100 కోట్ల కలెక్షన్స్ మూవీస్. నిజంగా ఇదే ట్రెండ్ కొనసాగితే గనక మళ్లీ వద్దన్నా థియేటర్స్ కి పూర్వ వైభవం రావడం ఖాయం. 
 

Tollywood