ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Thanuja Is The Winner Of Cooku With Jathiratnalu 2

BB విన్ అవ్వలేదు-కుకు షో విన్ అయ్యింది

Thanuja Is The Winner Of Cooku With Jathiratnalu 2

 

బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో ఎంతో క్యూట్ గా స్వీట్ గా ఆకట్టుకున్న లేడీ సింగం తనూజ పుట్టస్వామి ఆ షో విన్నర్ అవుతుంది అని ఆమె అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆమెతో ఫ్రెండ్ షిప్ చేసి షో లో క్రేజ్ తెచ్చుకున్న కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. దానితో తనూజ చాలా ఫీలైంది. తనూజ కన్నా ఎక్కువ ఆమె అభిమానులు ఆమె విన్నర్ అవనందుకు ఫీలయ్యారు.

స్టార్ మా లో వచ్చిన బిగ్ బాస్ విన్నర్ అవ్వలేని కారణంగానో ఎందుకో తనూజ చాలా రోజులు లో ప్రొఫైల్ ని మైంటైన్ చేసింది. స్టార్ మా ప్రోగ్రామ్స్ లోను కనిపించలేదు, ఆతర్వాత ఎప్పటికో స్టార్ మా లో వస్తున్న కుకు విత్ జాతి రత్నాల షో లో తనూజ ఎంట్రీ ఇవ్వడమే కాదు ఆమె తన వంటలతో జెడ్జి లను ఇంప్రెస్ చేసింది.

కొన్ని నెలలుగా సాగుతున్న ఈ షో లో డిమోన్ పవన్ దగ్గర నుంచి కళ్యాణ్ పడాల వరకు, ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ లు, యుట్యూబర్స్, కమెడియన్స్ పాల్గొన్న ఈ షో ఫైనల్ జెడ్జిమెంట్ లో తనూజ పుట్టస్వామి విన్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఆదివారం కుకు విత్ జాతిరత్నాలు షో ఫైనల్ ఎపిసోడ్ రాబోతుంది.

ఈ ఎపిసోడ్ లో తనూజ కుకు షో విన్నర్ అయ్యింది. ఆ విషయం ముందే లీకైపోయింది. సో బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోతేనేమి తనూజ కుకు విత్ జాతిరత్నాలు షో విన్ అయ్యింది. 

Thanuja Puttaswamy Is The Winner Of Cooku With Jathiratnalu Season 2