సీరియస్ వార్నింగ్ ఇస్తున్న మృణాల్
Mrunal Thakur issues legal warning over deepfakes
కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ ఎంతగా వారి పరువును డ్యామేజ్ చేస్తున్నాయో చూస్తున్నాం. సెలబ్రిటీస్ టార్గెట్ గా ఈ డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్ ని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ డీప్ ఫేక్ బారిన పడిన వారిలో నటి రష్మిక, ఇలా ఈ కోవలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు.
తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. AI సాయంతో రూపొందించిన ఈ డీప్‌ఫేక్ చిత్రాలు వేగంగా వైరల్ అయ్యాయి. దానితో అలెర్ట్ అయిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా తన పేరుతొ ప్రచారమవుతున్న ఫొటోస్, వీడియోస్ అన్ని నకిలీవి అని వాటిని నమ్మొద్దు అని చెప్పారు.
అంతేకాకుండా డీప్ ఫేక్ వీడియోస్, ఫొటోస్ వైరల్ చేస్తున్న వారికి మృణాల్ ఠాకూర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నాకు సంబందించిన డీప్‌ఫేక్ ఫొటోలను వెంటనే డిలీట్ చేయాలి. వాటిని షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. అవసరమైతే అధికారికంగా ఫిర్యాదు చేస్తాను అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పారు.







































