Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun's Raaka Glimpse Likely to Drop This August?

రాకా పై అప్పుడే క్లారిటీ వస్తుంది

Allu Arjun's Raaka Glimpse Likely to Drop This August?


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం రాకా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ముంబై లోనే జరుగుతుంది. అల్లు అర్జున్ రీసెంట్ గా భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లొచ్చారు. తర్వాత ఫ్యాన్స్ మీట్ పెట్టి ముంబై వెళ్లిపోయారు.

అట్లీ తో అల్లు అర్జున్ చేస్తున్న రాకా చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది అంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఈ చిత్రంలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది, ఆమెతో పాటుగా రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ లు నటిస్తున్నారంటూ చాలా రోజులుగా వినిపిస్తున్న వార్త.

అల్లు అర్జున్ బర్త్ డే కి వచ్చిన ఫస్ట్ లుక్ తప్ప మరే ఇతర వివరాలు రాకా పై బయటకు రాలేదు. అయితే వీటన్నిటికీ ఆగష్టు లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. అంటే ఆగస్టు లో రాకా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తూ వీటిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో అల్లు ఫ్యాన్స్ కి ఆగస్టు లో అదిరిపోయే ట్రీట్ రాబోతుందన్నమాట.

Raaka are expected to unveil a special video glimpse in August