Advertisement

బాలయ్య 2 మంత్స్ నాట్ అవైలబుల్

When will Balakrishna Resume NBK111?

 

నందమూరి బాలకృష్ణ NBK 111 షూటింగ్ లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. కాకినాడ పోర్ట్ లో NBK 111 సెట్ లో జరిగిన ప్రమాదంలో బాలయ్య ప్రమాదం బారిన పడ్డారు. ఆతర్వాత చిన్న దెబ్బె అంటూ హైదరాబాద్ AIG వైద్యులు ఆయనకు సర్జరీ చేసారు. సర్జరీ సక్సెస్ అవ్వగా ఎనిమిదివారాల పాటు రెస్ట్ అని చెప్పినట్లుగా అన్నారు.

బాలయ్య నటిస్తున్న సినిమా NBK 111 షూటింగ్ ఆయనకు జరిగిన ప్రమాదం వల్ల వాయిదా పడింది. అయితే ఓ నెల రోజుల పాటు బాలయ్య అందుబాటులో ఉండరని అనుకున్నారు. కానీ బాలయ్య రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని, నెల నెల డాక్టర్స్ స్కాన్ చేసి చెక్ చేసుకున్నాకే ఆయనకి ఫిజియో థెరపీ చేస్తారట.

ఆయన ఫిట్ గా అయ్యాకే మళ్ళీ సెట్ లోకి వెళతారని, దాని కోసం రెండు నెలలు సమయం పడుతుంది అని తెలుస్తుంది. సో రెండు నెలల పాటు అటు NBK 111 డైరెక్టర్ గోపీచంద్ కి కానీ, అటు NBK 112 డైరెక్టర్ కొరటాలకు కానీ బాలయ్య అందుబాటులో ఉండరు. 

NBK's Injury Disrupts his Plans