చెన్నై లవ్ స్టోరీ కి ఎదురు లేదు
Kiran Abbavaram Chennai Love Story
ఈరోజు వరకు కిరణ్ అబ్బవరం నటించిన ప్యూర్ లవ్ స్టోరీ చెన్నై లవ్ స్టోరీ కి విజయ్ జన నాయగన్ చిత్రం వలన ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే అనుమానం తొణికిసలాడింది. జన నాయగన్ వలన చెన్నై లవ్ స్టోరీ కి కలెక్షన్స్ తగ్గుతాయి, జన నాయగన్ హిట్ అయితే చెన్నై లవ్ స్టోరీకి కష్టమనే అభిప్రాయాలు వినిపించాయి.
కానీ కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి ఎదురు లేదు. జన నాయగన్ కి తెలుగులో డిజాస్టర్ రివ్యూస్ పడ్డాయి. భగవంత్ కేసరి రీమేక్ అంటూ ఆ పేరుని చెడ గొట్టారు తప్ప.. జన నాయగన్ లో చెప్పుకోవడానికి ఏమి లేదు. సినిమా లో ఏ ఒక్క కేరెక్టర్ బాగా చేయలేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
సో రేపు జులై 24 న విడుదల కాబోయే చెన్నై లవ్ స్టోరీకి ఇక జన నాయగన్ వలన ఎలాంటి నష్టం లేదు. కిరణ్ అబ్బవరం సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానం, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇప్పుడు జన నాయగన్ ఎఫెక్ట్ కూడా లేదు. ఇక చెన్నై లవ్ స్టోరీకి మంచి ఓపెనింగ్స్ రావడం పక్కా..








































