Advertisement

అమితాబ్ ICU పోస్ట్ వెనుక అసలు నిజం!

Amitabh Bachchan Shares Health Update

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఇటీవల రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అమితాబ్  సర్జరీ జరిగిందని, ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారంటూ  వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బిగ్ బీ తన ఆరోగ్యంపై వ‌స్తోన్న‌  వదంతు లన్నింటినీ ఖండించారు. తాను ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకోలేదని.. కేవలం తన బ్లాగ్‌లో రాసిన ఓ  పోస్ట్ వల్ల అపోహలు తలెత్తాయన్నారు.

అమితాబ్ బచ్చన్ ఇటీవల  అధికారిక బ్లాగ్ ద్వారా అభిమానులతో ఓ పంక్తిని పంచుకుంటూ తన శ్రేయోభి లాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ పోస్ట్‌లో వైద్యపరమైన పదజాలం .. ఆసుపత్రి ప్రస్తావన రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా కంగారుపడ్డారు. అమితాబ్  తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తిందని, అత్యవసర చికిత్స అందిస్తున్నారని అభిమానులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో ఈ వార్త  వైరల్ కావడంతో మీడియా వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే ఆ పోస్ట్ పూర్తిగా వేరే సందర్భానికి సంబంధించినదని అమితాబ్ బచ్చన్ తాజాగా  క్లారిటీ ఇచ్చారు. తాను సాధారణంగా రాసిన వాక్యాలను  తప్పుగా అర్థం చేసుకున్నారని  పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు అంతగా ఆందోళన చెందడం చూసి చలించిపోయిన అమితాబ్  వెంటనే స్పందించి తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని తేల్చిచెప్పారు. ఎలాంటి ధృవీకరణ లేని వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
 

Amitabh Bachchan puts health scare rumours to rest