Advertisement

స్పిరిట్ లో మరో హీరోయిన్

Another heroine in Spirit


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ చిత్రం షూటింగ్ చాలా స్పీడుగా సాగుతుంది. ప్రభాస్ గనక మరో ప్రాజెక్ట్ లోకి వెళ్లకపోతే ఈపాటికి స్పిరిట్ షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ 40 శాతం పూర్తయ్యింది, ఈ చిత్రం మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అంటూ హైప్ క్రియేట్ చేసారు.

ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డుమ్రి నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా మెరుపు కేరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ నే దించే ఆలోచనలో సందీప్ ఉన్నారట.

ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్ ని ఆ కీలక పాత్రకోసం తీసుకోవాలని చూస్తున్నారట. మరి బాలీవుడ్ నటులను తీసుకుని స్పిరిట్ కి వెయిట్ పెంచడమే కాకుండా.. స్పిరిట్ పై నార్త్ లో స్పెషల్ ఫోకస్ ఉండేలా సందీప్ జాగ్రత్తపడుతున్నారు అనేది దీనిని బట్టి అర్ధమవుతుంది. 
 

Katrina Kaif In Talks For Game Changing Role In Spirit