ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The wave of folk songs is breaking records!

రికార్డులు బద్దలు కొడుతున్న ఫోక్ సాంగ్స్ హవా!

The wave of folk songs is breaking records!The wave of folk songs is breaking records!

పరిశ్రమలో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన ఐటం పాటల జోరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వెండితెరపై గ్లామర్ సాంగ్స్ స్థానాన్ని  పల్లెటూరి వాతావరణాన్ని తలపించే జానపదాలు  ఆక్రమిస్తున్నాయి. అచ్చమైన గ్రామీణ పదాలతో, డీజే బీట్స్‌తో సాగే పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా వ్యూస్ పరంగా రికార్డులను సృష్టిస్తూ సినిమా పాటలను సైతం వెనక్కి నెడుతున్నాయి.

ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రేక్షకుల్లో మారుతున్న రుచులే. సినిమా పాటల్లో పునరావృతమయ్యే రెగ్యులర్ థీమ్స్ కంటే నేల విడిచి సాగని మట్టి వాసన గల జానపదాలు నేటి శ్రోతలను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేస్తున్నాయి. స్థానిక మాండలికాలు, పల్లె ప్రజల జీవితాలు, బతుకు కష్టాలు, సంప్రదాయాలు ఈ పాటల్లో ప్రధాన వస్తువుగా మారుతున్నాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాగే ఈ గీతాలు సామాన్యులకు సైతం ఎంతో చేరువవుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్ ట్రెండ్ నడుస్తున్న తీరు ఈ ఫోక్ సాంగ్స్ ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వంటి మాధ్యమాలలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ జానపదాలకే ఎక్కువగా స్టెప్పులేస్తున్నారు. రీమిక్స్ వర్షన్స్, విభిన్న నృత్య రూపకాలతో ఇవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కేవలం ఆన్‌లైన్ మాత్రమే కాకుండా? స్థానిక ఉత్సవాలు, రికార్డింగ్ డాన్సులు, పెళ్లి వేడుకల్లోనూ ఈ పాటలదే పైచేయి.

ఈ జానపదాల విజయంలో సంగీత దర్శకులు, స్వతంత్ర గాయకుల పాత్ర కూడా ఎంతో ఉంది. సాంప్రదాయ జానపద బాణీలకు ఆధునిక డిజిటల్ మ్యూజిక్, డీజే ట్యూన్స్ జోడించి సరికొత్త సౌండ్‌ట్రాక్‌లను సృష్టిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య కళాకారులు సైతం సోషల్ మీడియా వేదికల ద్వారా గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ సైతం  ఫోక్ సింగర్స్ క్రేజ్ పై ఆధారపడే స్థాయికి పరిస్థితి మారింది.

మాస్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడంలో ఈ పాటలు సినిమా పాటలను మించిపోతున్నాయి. థియేటర్లలో కనిపించే మాస్ ఆడియెన్స్ పల్స్ ఇప్పుడు  ప్రైవేట్ జానపద గీతాల చుట్టూనే తిరుగుతోంది. సామాన్యుల జీవితాల్లోని ఉత్సాహాన్ని, ఆనందాన్ని అచ్చంగా ప్రతిబింబిస్తాయి. కమర్షియల్ హద్దులు లేకపోవడం వల్ల సృజనాత్మకతకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది శ్రోతలను మరింతగా ఆకట్టుకుంటోంది.
 

folk songs