Advertisement

ఆ ఎపిక్ సీన్ వెనక అసలు రహస్యం!

Secret Behind The Odyssey Epic Scene

 

హాలీవుడ్ మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తన విజువల్ వండర్స్ తో ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆశ్చ‌ర్య ప‌రు స్తుంటారు.  ఇటీవలే రిలీజ్ అయిన  `ది ఒడిస్సీ` తో  మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఇటీవ‌లే తెలుగులోనూ  రిలీజ్ అయిన సినిమాకు అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.  తాజాగా చిత్రంలోని అత్యంత కీలకమైన ఎపిక్ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా మధ్యభాగంలో వచ్చే ఓ భారీ ఘట్టం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సీన్ సరికొత్త అనుభూతిని పంచుత‌కుంది.

తాజాగా  ఈ సీన్  కోసం సాంకేతిక నిపుణులతో కలిసి ఎంతో శ్రమించానని నోల‌న్  తెలిపారు. ఈ ప్రత్యేక సన్నివేశాన్ని తెరకెక్కించడానికి డిజిటల్ గ్రాఫిక్స్ కంటే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ లొకేషన్లకే నోలన్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చా మ‌న్నారు. సముద్ర ప్రయాణాలు, ప్రాచీన యుద్ధ వాతావరణం, మానసిక సంఘర్షణలను ప్రతిబింబించే  ఎపిక్ సీన్ షూటింగ్ కోసం నెలల తరబడి కష్టపడినట్లు  వెల్లడించారు.

నటుల హావభావాలు, కెమెరా యాంగిల్స్, లైటింగ్ విషయంలో అనుసరించిన ప్రత్యేక విధానాలు ఈ దృశ్యానికి ప్రాణం పోశాయని తెలిపారు. సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయేలా ఈ ఎపిక్ సీన్‌ను మలిచామని నోలన్
అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను తెర‌కెక్కించిన‌ట్లు  పేర్కొన్నారు. 

Whats Behind The Odyssey Epic Scene