కియారా పై గురూజీ కన్ను

Kiara talks about NTR-Trivikram movie


త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకీ తో తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రం ఫినిష్ చేసి విడుదల చెయ్యగానే ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన గాడ్ ఆఫ్ వార్ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి వెళ్ళిపోతారు. రీసెంట్ గానే ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై అనౌన్సమెంట్ రావడము, అది తమిళనాట పెద్ద రచ్చ జరగడము చూసాం.

కుమారస్వామి పుట్టుక విషయంలో తమిళులు ఈ ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు తెలుపుతున్నారు. మరోపక్క ఇదే కోవలో హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ మరో ప్రాజెక్ట్ ని తమిళంలో ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట.

ఆమె రామ్ చరణ్ తో రెండుసార్లు యాక్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. సౌత్ లో హిట్ కోసం తపన పడుతున్న కియారా కు ఎన్టీఆర్ సినిమాలో గురూజీ ఛాన్స్ ఇవ్వబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ తో కియారా నటించింది. కానీ వార్ 2 లో ఆమె ఎన్టీఆర్ కి జోడిగా కాదు, హృతిక్ రోషన్ కి జోడిగా కనిపించింది.

ఇపుడు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఈ గ్లామర్ భామను తీసుకొస్తున్నారనే టాక్ నడుస్తుంది. 

NTR and Trivikram God of War is growing as reports suggest Kiara Advani may play the female lead